ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మమ్మల్ని కలిశారు: సజ్జల
- పీఆర్సీపై పీటముడి
- తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వం
- తమకు ఆమోదయోగ్యం కాదంటున్న ఉద్యోగులు
- చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అంటున్న సజ్జల
ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ వద్దకు వచ్చారని, తమ సమస్యలను వివరించారని సజ్జల తెలిపారు. వారు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్నామని, వాటిపై చర్చిస్తామని వారికి తెలిపినట్టు వెల్లడించారు. మిగిలిన ఉద్యోగ సంఘాలకు చెందినవారు కూడా రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 3న లక్షమందితో 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.