మల్టీస్టారర్ లో అల్లువారి అబ్బాయి!

28-01-2022 Fri 12:04
  • అల్లు శిరీష్ తాజా చిత్రంగా 'ప్రేమ కాదంట'
  • సరైన హిట్ కోసం వెయిటింగ్
  • అనిల్ సుంకర సినిమాకి గ్రీన్ సిగ్నల్
  • మరో హీరోగా శ్రీవిష్ణు    
Allu Shirish in Sri Vishnu movie
మొదటి నుంచి కూడా అల్లు శిరీష్ నిదానమే ప్రధానమన్నట్టుగా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ వస్తున్నాడు. కథ నచ్చకపోతే నచ్చే కథ వచ్చేంతవరకూ వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇంతగా దృష్టి పెట్టినప్పటికీ, ఇంతవరకూ అతనికి చెప్పుకోదగిన హిట్ పడలేదు. అలాంటి ఒక హిట్ కోసమే ఆయన చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.

ఇక అల్లు శిరీష్ ఒప్పుకున్న సినిమాలు కూడా అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఆయా కారణాల వలన ఆయన నుంచి సినిమాలు రావడం లేటవుతోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ప్రేమకాదంట' పరిస్థితి కూడా అదే. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

ఈ నేపథ్యంలో శిరీష్ ఒక మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన శ్రీవిష్ణుతో కలిసి నటించనున్నాడని అంటున్నారు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇకనైనా అల్లువారి అబ్బాయి స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.