అజిత్ 'వలిమై' విడుదల తేదీ అదేనా?

27-01-2022 Thu 17:19
  • భారీ యాక్షన్ మూవీగా 'వలిమై'
  • ప్రతినాయకుడిగా కార్తికేయ
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
  • మార్చి 4వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్  
Valimai will release on March 4th
అజిత్ తో ఒక సినిమా చేసిన దర్శక నిర్మాతలు వరుసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటారు. అలాంటి ఒక బాండింగ్ ఆయనతో ఏర్పడిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు అజిత్ .. వినోద్ .. బోనీ కపూర్ కాంబినేషన్లో 'వలిమై' సినిమా రూపొందింది. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.

అలాంటి ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

భారీ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా బాణీలను సమకూర్చగా, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన దోపిడీ దొంగల నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం.