తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా

27-01-2022 Thu 15:59
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • నిత్యం 3 వేలకు పైచిలుకు కొత్త కేసులు
  • నేడు మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పరీక్షలు
  • పాజిటివ్ గా నిర్ధారణ
Telangana minister Niranjan Reddy tested corona positive
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 3 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.

తనకు కరోనా సోకడంపై స్పందిస్తూ, కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా తన నివాసం నుంచి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నాబార్డు రాష్ట్ర దృష్టి పత్రాన్ని విడుదల చేశారు.