వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు

Dil Raju enters into web series making
  • హరీశ్ శంకర్ తో కలిసి వెబ్ సిరీస్ ను నిర్మించనున్న దిల్ రాజు
  • సిరీస్ కు దర్శకత్వం వహించనున్న చంద్రమోహన్
  • ఇటీవలే తన సోదరుడి కుమారుడిని వెండి తెరకు పరిచయం చేసిన దిల్ రాజు
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి 'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సరీస్ ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్ కు కథను హరీశ్ శంకరే అందిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు ఈరోజు దిల్ రాజు ప్రకటించారు.

ఈ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, హరీశ్ శంకర్ కాంబినేషన్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన తాజా చిత్రం 'రౌడీ బాయ్స్' ద్వారా తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను దిల్ రాజు వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి ఉంటుందని వెబ్ సిరీస్ గురించి పరోక్షంగా దిల్ రాజు చెప్పారు.
Go Back to Shorts
Dil Raju
Web Series
Tollywood
Harish Shankar

More Telugu News