Sajjala Ramakrishna Reddy: ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడైనా రావొచ్చు... సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉంది: సజ్జల

  • పీఆర్సీ అంశంలో కుదరని ఏకాభిప్రాయం
  • కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం పట్టు
  • ధర్నాలు చేపడుతున్న ఉద్యోగులు
  • చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్న సజ్జల
Sajjala invites employees unions leaders to talk with ministers committee

పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రమ్మని పిలిచారు. ఉద్యోగ సంఘాల నేతలు ఈ క్షణమైనా రావొచ్చని, చర్చలు జరిపేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు.

ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, ఓ మెట్టు దిగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ రేపు కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాగా, ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం క్రమశిక్షణ రాహిత్యమని అన్నారు.

More Telugu News