Sri Vishnu: 'భళా తందనాన' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!

  • విభిన్నమైన కథాంశంతో 'భళా తందనాన'
  • శ్రీవిష్ణు జోడిగా కేథరిన్
  • ప్రతినాయకుడిగా 'గరుడ' రామ్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
Bhala Thandanana teaser released on Jan 28th

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన 'రాజ రాజ చోర' హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల వచ్చిన 'అర్జున ఫల్గుణ' హిట్ కాకపోయినా, మంచి ప్రయత్నం అనిపించుకుంది.

తాజాగా ఆయన నుంచి మరో సినిమా రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'భళా తందనాన'. వారాహి బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 28వ తేదీ ఉదయం 10:24 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, పోస్టర్ ను వదిలారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. శ్రీవిష్ణు సరసన నాయికగా కేథరిన్ కనువిందు చేయనుండగా, ప్రతినాయకుడిగా 'గరుడ' రామ్ కనిపించనున్నాడు..

More Telugu News