COVAXIN: బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ధరల ఖరారు!

  • ప్రస్తుతం ఆసుపత్రుల్లోనే అందుబాటులో టీకాలు
  • ఒక్కో డోసు ధర రూ. 275 ఉండే అవకాశం
  • సర్వీసు చార్జీ పేరుతో అదనంగా మరో రూ. 150 వసూలు
  • కసరత్తు ప్రారంభించిన ఎన్‌పీపీఏ
Covishield Covaxin prices likely to be capped at Rs 275 per dose

కరోనా టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల బహిరంగ మార్కెట్ ధరలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ రెండు టీకాల ఒక్కో డోసు ధర రూ. 275 వరకు ఉండొచ్చని సమాచారం. సర్వీసు చార్జీల రూపంలో మరో రూ. 150 అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో కొవాగ్జిన్‌ రూ. 1200కు, కొవిషీల్డ్‌ రూ. 780కి లభిస్తోంది.

ఇప్పటి వరకు ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ఈ టీకాలను బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు భారత ఔషధ నియంత్రణ సంస్థ  డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. పరిశీలించిన కొవిడ్-19 నిపుణుల కమిటీ షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ఒక్కో డోసు ధరను ఎంతకు విక్రయించాలన్న దానిపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) కసరత్తు ప్రారంభించింది.

More Telugu News