ఆదిలాబాద్ కు గుడ్ న్యూస్: కేటీఆర్

26-01-2022 Wed 18:09
  • ఆదిలాబాద్ లో ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటవుతోంది
  • ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్ పాండేను కలిసి ధన్యవాదాలు తెలిపాను
  • టయర్ 2 పట్టణాలకు కూడా ఐటీని తీసుకెళ్తున్నాం
Happy news for Adilabad says KTR
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 'ఆదిలాబాద్ కు శుభవార్త. ఆదిలాబాద్ పట్టణంలో కొత్త ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్ పాండేను కలిసి ధన్యవాదాలు తెలిపాను. టయర్ 2 పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఆ దిశగా మరో పెద్ద అడుగు పడింది' అని ట్వీట్ చేశారు.