Sharwanand: 'ఒకే ఒక జీవితం' నుంచి సిరివెన్నెల సాంగ్!

Oke Oka Jeevitham Song Released
  • శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం'
  • కథానాయికగా రీతూ వర్మ 
  • కీలకమైన పాత్రలో అమల అక్కినేని 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' రూపొందింది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరోకి తల్లి పాత్రలో అమల కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇది అమ్మపై అల్లిన పాట .. అమ్మతో తనకి గల అనుబంధాన్ని ఒక కొడుకు ఆవిష్కరించేపాట. 'అమ్మా .. వినమ్మా .. ' అంటూ ఈ పాట మొదలవుతుంది. ఇది సిరివెన్నెల పాట కనుక సాహిత్యం ఆ స్థాయిలోనే ఉంది. 'నిన్ను వదిలేంత ఎదగాలనుకోను .. నువ్వుంటే నేనే, నువ్వంటే నేనే .. ప్రతిమ కూడా బ్రతకాలనుకుంటుంది' అనే పద ప్రయోగాలు బాగున్నాయి.

సిరివెన్నెల సాహిత్యం అందంగా .. అనుభూతి పరిమళంగానే అనిపిస్తాయి. కాకపోతే జేక్స్ బిజోజ్ అందించిన వరుసలు కాస్త కష్టంగా అనిపిస్తాయి. సందర్భాన్ని బట్టి తెరపై ఈ పాట మరిన్ని మార్కులు కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sharwanand
Rituvarma
Amala Akkineni
Oke Oka Jeevitham Movie

More Telugu News