ఏపీలో కరోనా అప్ డేట్స్.. కొత్తగా 13,618 కేసులు!

26-01-2022 Wed 17:43
  • రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 8,687 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,318
Corona active cases crosses 1 lakh in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 13,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,791 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 466 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందగా... 8,687 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,22,573కి పెరిగింది. ఇప్పటి వరకు 21,01,685 మంది కోలుకోగా... 14,570 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,318కి పెరిగాయి.