removable batteries: స్మార్ట్ ఫోన్లలో రిమూవబుల్ బ్యాటరీలు ఎందుకు ఉండడం లేదు?

  • ఎలక్ట్రోడ్ లతో అధిక వేడి విడుదల
  • కనుక బయటకు తీస్తే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం
  • రిమూవబుల్ బ్యాటరీతో ఫోన్ బల్కీ
  • వీటికి పరిష్కారమే నాన్ రిమూవబుల్
Why modern smartphones donot have removable batteries and how does it affect consumers

పదేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లు బ్యాటరీలు తీసి పెట్టే ఆప్షన్ తో వుండేవి. కానీ, ఇప్పుడు అన్నీ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో కూడిన ఫోన్లే కనిపిస్తాయి. దీని వెనుక బ్యాటరీ టెక్నాలజీలో వచ్చిన మార్పులు, భద్రతా అంశాలు దాగి ఉన్నాయి.

అధిక వేడి విడుదల 
బ్యాటరీలో ఉండే ఎలక్ట్రోడ్ లు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. దీంతో డైరెక్ట్ కాంటాక్ట్ జరిగితే షార్ట్ సర్క్యూట్ కు దారితీస్తుంది. బ్యాటరీ పేలిపోవడం లేదా కాలిపోవడం జరగొచ్చు. కనుక రిమూవబుల్ బ్యాటరీలను ఇచ్చేట్టు అయితే వాటికి మరింత రక్షణగా బలమైన ప్లాస్టిక్ కేసు అమర్చాలి. అది బరువు పెరిగేందుకు, స్మార్ట్ ఫోన్ బల్కీగా అయ్యేందుకు కారణమవుతుంది.

తీయాల్సిన అవసరం పోయింది
దీంతో ఇంజనీర్లు బ్యాటరీని బయటకు తీసే ఏర్పాటు లేకుండా చేయడమే పరిష్కారంగా భావించారు. లిథియం అయాన్, లిథియం పాలీమర్ బ్యాటరీలు కావడంతో ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది. రోజంతా వినియోగించినప్పటికీ, చార్జింగ్ మిగిలి ఉండేంత సామర్థ్యంతో ఫోన్లు వస్తున్నాయి. ఫలితంగా చార్జింగ్ అయిపోతే, వేరొక బ్యాటరీని మార్చుకునే అవసరం నేడు లేదు. 10-15 నిమిషాల్లోనే సగం బ్యాటరీ చార్జ్ అయ్యే టెక్నాలజీ అందుబాటులో ఉంది. షావోమీ కొత్తగా 10 నిమిషాల్లో 100 శాతం చార్జ్ పూర్తయ్యే ఫోన్ ను తీసుకువస్తోంది.

బల్కీగా
ఉండకూడదు
కనుక బ్యాటరీ స్వాపింగ్ అనవసరమని కంపెనీలు గుర్తించాయి. రక్షణ, వినియోగ అవసరాల దృష్ట్యా నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఆచరణలోకి తీసుకొచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. కనుక ఫోన్ కాస్త స్లిమ్ గా, అధిక బరువుగా లేకుండా ఉండాలని యూజర్లు కోరుకుంటారు. కిందపడినా పెద్దగా డ్యామేజీ కాకూడదు. నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే యూజర్ల అవసరాలను చేరుకోవడం కంపెనీలకు సులభం అవుతుంది.

శాశ్వతం కాదు..
నాన్ రిమూవబుల్ బ్యాటరీలు శాశ్వతం కాదని తెలుసుకోవాలి. ఒకటి రెండేళ్ల వినియోగం తర్వాత ఫోన్ వెనుక భాగంలో ఉబ్బుకొస్తుందేమో పరిశీలిస్తూ ఉండాలి. అలా గుర్తించినట్టయితే కంపెనీ అధీకృత సేవా సెంటర్ కు వెళ్లి బ్యాటరీని మార్పించుకోవాలి. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

More Telugu News