నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కాంబినేషన్లో మరో మూవీ?

25-01-2022 Tue 17:44
  • రిలీజ్ కి రెడీగా 'రాధేశ్యామ్'
  • ఈ ఏడాదిలోనే 'సలార్' .. 'ఆది పురుష్'
  • సెట్స్ పైనే ఉన్న 'ప్రాజెక్టు K'
  • కరణ్ జొహార్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్  
Prabhas in Karan Johar Movie
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఆయనతో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా ఉంది. ఆయన తాజా చిత్రంగా 'రాధే శ్యామ్' విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక 'సలార్' .. 'ఆది పురుష్' సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K' సినిమా చేస్తున్నాడు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతోందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి కొంత షూటింగ్ జరిగింది. ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ మరో సినిమా కూడా ప్రభాస్ తోనే ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత కరణ్ జొహార్ కావడం విశేషం.

ప్రభాస్ కి గల క్రేజ్ ను .. ఆయనకి గల మార్కెట్ ను ప్రత్యక్షంగా చూసిన కరణ్ జొహార్ .. ప్రభాస్ నుంచి ఓకే చెప్పించుకున్నాడట. ఈ ప్రాజెక్టును ఆయన నాగ అశ్విన్ కి అప్పగించడం జరిగిపోయిందని అంటున్నారు. 'ప్రాజెక్టు K'కి సంబంధించిన హిందీ వెర్షన్ బాధ్యతలను తాను చూసుకుంటానని కరణ్ జొహార్ చెప్పినట్టుగా సమాచారం.