Kodali Nani: బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా: మంత్రి కొడాలి నాని

Kodali Nani asks BJP leaders do not fall into TDP trap
  • గుడివాడ వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • స్పందించిన మంత్రి కొడాలి నాని
  • సోము వీర్రాజు టీడీపీకి అనుబంధంగా పనిచేస్తుంటాడని వ్యాఖ్య 
బీజేపీ నేతలు గుడివాడ వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడంపై ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడలో మతకలహాలు రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి సోము వీర్రాజు అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అజెండాతోనే బీజేపీ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. టీడీపీ అజెండాను అమలు చేయడంవల్లే బీజేపీకి జనసేనతో కలిసినా ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు రాలేదని స్పష్టం చేశారు. చేతనైతే గోవాలో కేసినోలకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమించాలని కొడాలి నాని సవాల్ విసిరారు.
Kodali Nani
BJP Leaders
TDP
Gudivada
Casino
YSRCP

More Telugu News