మహేశ్ బాబు మూవీలో మోహన్ బాబు?

25-01-2022 Tue 17:17
  • కీలక పాత్రలను చేస్తున్న మోహన్ బాబు 
  • మహేశ్ మూవీ కోసం సంప్రదించిన త్రివిక్రమ్ 
  • పాత్ర పరమైన చర్చలు జరిగాయనే టాక్ 
  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'సన్నాఫ్ ఇండియా'
Mohan Babu in Trivikram movie
విలన్ గా .. హీరోగా మోహన్ బాబు సుదీర్ఘకాలం పాటు వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. తనకి బాగా నచ్చితే కీలకమైన పాత్రలు చేయడానికి కూడా ఆయన ఓకే అనేస్తున్నారు. అలా ఆయన ఆ మధ్య 'మహానటి'లో ఎస్వీఆర్ గా చేశారు. అలాగే 'ఆకాశం నీ హద్దురా' సినిమాలోను కనిపించారు.

తాజాగా ఆయన త్రివిక్రమ్ సినిమాలో చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం మహేశ్ చేస్తున్న 'సర్కారువారి పాట' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్ పైకే వెళ్లనున్నాడు. ఈ సినిమాలో మహేశ్ కి మావయ్య క్యారెక్టర్ ఒకటి ఉందట.

ఆ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగా ఆ పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో త్రివిక్రమ్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. పాత్ర పరమైన చర్చలు కూడా జరిగాయని చెబుతున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం ఖాయమేనని అంటున్నారు. ఇక ఆయన హీరోగా చేసిన 'సన్నాఫ్ ఇండియా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.