వివాదంలో చిక్కుకున్న సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని

25-01-2022 Tue 14:27
  • మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్న రామ్
  • గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ వివాదం
  • వీడియోలను డిలీట్ చేయాలంటూ గౌడ కుల సంఘాల ఆగ్రహం
Singer Sunitha husband faces problem
  టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నడుస్తోంది. ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో ఈ ఛానెల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ రామ్ పై గౌడ కుల సంఘాలు మండిపడ్డాయి.

అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానల్ పై ఈ రోజు దాడికి కూడా యత్నించినట్టు సమాచారం. తమ సామాజికవర్గ మహిళలను కించపరిచేలా తీసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై రామ్ స్పందించాల్సి ఉంది.