తెలంగాణలో మరో 3,980 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 97,113 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,439 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 33,673 మందికి చికిత్స
అదే సమయంలో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,38,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,01,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,673 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,075కి పెరిగింది.
