Vikram: అమెజాన్ ప్రైమ్ కి విక్రమ్ 'మహాన్'

Mahan Movie Updete
  • విక్రమ్ హీరోగా 'మహాన్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కీలకమైన పాత్రలో తనయుడు ధృవ్
  • వచ్చే నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన విభిన్నమైన సినిమాల జాబితాలో 'మహాన్' ఒకటి. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా ఇది విక్రమ్ కి 60వ సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమాకి మరో ప్రత్యేకత కూడా ఉంది .. అదేమిటంటే విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేయడం. తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో, సహజంగానే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా థియేటర్లకు వెళుతుందా? ఓటీటీలో వస్తుందా? అనే విషయంలో నిన్నమొన్నటివరకూ ఒక అయోమయం నెలకొంది. కానీ ఈ సినిమా అమెజాన్ లో వచ్చేనెల 10 నుంచి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో  స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాలో వాణి భోజన్ .. సిమ్రాన్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Vikram
Dhruv
Simran
Mahan Movie

More Telugu News