29 మంది బాలలకు ప్రధానమంత్రి బాల పురస్కార్... జాబితాలో తెలుగు బాలలు
- ధైర్యసాహసాలు, ప్రతిభ ప్రదర్శించిన బాలలకు గుర్తింపు
- అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని సమావేశం
- డిజిటల్ సర్టిఫికెట్ల అందజేత
ప్రధానమంత్రి బాల పురస్కార్ కు ఎంపికైన వారికి నేడు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు. బాల పురస్కార్ అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు. వారిని అభినందించారు. బాల పురస్కార్ అవార్డులకు 5 నుంచి 18 ఏళ్ల లోపు వారిని పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, గతేడాది ఈ అవార్డుకు ఎంపికైన వారికి కూడా ప్రధాని నేడు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు.