Vaishnav tej: 'రంగ రంగ వైభవంగా' నుంచి కొత్త పోస్టర్!

Ranga Ranga Vaibhavanga new poster
  • వైష్ణవ్ తేజ్ హీరోగా 'రంగ రంగ వైభవంగా'
  • కథానాయికగా కేతిక శర్మ
  • ఇద్దరికీ ఇది మూడో సినిమానే  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాను, తమిళంలో రీమేక్ చేసిన వాడాయన. వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ఆయన 'రంగ రంగ వైభవంగా' సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు ఉదయమే ఎనౌన్స్ చేశారు. టైటిల్ లాంచ్ టీజర్ అంటూ, నాయక నాయికల కాంబినేషన్లోని ఒక టీజర్ ను కూడా వదిలారు. హీరోయిన్ .. హీరోకి బట్టర్ ఫ్లై కిస్ ఎలా ఉంటుందో చెప్పడం .. టేస్ట్ చేయించడం ఈ టీజర్లో చూపించారు. రిబ్బన్ కటింగ్ రొమాంటిక్ సీన్ తో ఉండటంతో ఇది పక్కా యూత్ ఫిల్మ్ అని అంతా డిసైడ్ అయ్యారు.

దాంతో కంగారు పడిపోయారేమో .. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడిన లవ్ స్టోరీ అనే ఫీల్ వచ్చేలా కొత్త పోస్టర్ లను వదిలారు. లంగావోణీ వేసుకుని తులసి కోటకు నమస్కరిస్తున్న కేతిక శర్మను ఆటపట్టిస్తూనో .. అల్లరి పెడుతూనే ఉన్నట్టుగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. నిజంగానే ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.

'రొమాంటిక్' సినిమాతో .. రొమాన్స్ తో కూడిన కథలకు .. సన్నివేశాలకు కేతిక శర్మ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఈ కారణంగానే యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఈ సినిమాలో ఆమె ఏ స్థాయిలో రచ్చ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

  • Loading...

More Telugu News