మన రాతను మనమే రాసుకోవాలా: 'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్!
- నగేశ్ కుకునూర్ నుంచి 'గుడ్ లక్ సఖి'
- గిరిజన యువతి పాత్రలో కీర్తి సురేశ్
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- ఈ నెల 28వ తేదీన విడుదల
కీర్తి సురేశ్ జోడీగా ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. గిరిజన యువతిగా కీర్తి సురేశ్ యాస .. వేషధారణ .. నడకలో పూర్తి వైవిధ్యం చూపించారని తెలుస్తోంది.
నాయిక ప్రతిభను గుర్తించి ఆది పినిశెట్టి ఆమెను జగపతిబాబు దగ్గరికి తీసుకుని రావడం.. రైఫిల్ షూటర్ గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 'మహానటి' తరువాత నాయిక ప్రధానమైన పాత్రలతో కీర్తి సురేశ్ చేసిన 'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా' నిరాశపరిచాయి. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.