ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి: చంద్రబాబు

23-01-2022 Sun 14:43
  • నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు
  • అన్యాయం జరుగుతుంటే ప్రతిఘటించాలని పిలుపు
Chandrababu pays tributes to Netaji Subhash Chandrabose
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అన్యాయంతో రాజీపడడం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టేనని నేతాజీ అన్నారని వెల్లడించారు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? నేతాజీ ప్రతిరూపాలై ఆ అన్యాయంపై పోరాడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తన అభ్యుదయ భావాలతో యువతరానికి చిరస్మరణీయ స్ఫూర్తిని అందించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కీర్తించారు. ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23 నుంచే దేశ గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని చంద్రబాబు పేర్కొన్నారు.