దక్షిణాఫ్రికాతో మూడో వన్డే... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

23-01-2022 Sun 14:11
  • కేప్ టౌన్ లో చివరి వన్డే
  • పరువు కోసం టీమిండియా ఆరాటం
  • టీమిండియాలో నాలుగు మార్పులు
  • సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలిచిన దక్షిణాఫ్రికా
Team India won the toss and elected bowling
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ నేడు కేప్ టౌన్ లో జరుగుతోంది. ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రంగా మారిన మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చహర్ లకు అవకాశమిచ్చింది. అటు, ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ తుదిజట్టులోకి వచ్చాడు.