childrens: పిల్లలు ముద్ద తినేందుకు నిరాకరిస్తున్నారా? కొవిడ్ ఏమో పరిశీలించుకోవాలి!

Parents lose appetite as kids under Omicron cloud push plate away
  • గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే ఇలానే చేయవచ్చు
  • పిల్లల్లో ఫ్లూ మాదిరి లక్షణాలు
  • కరోనా టెస్ట్ తో విషయాన్ని నిర్ధారించుకోవాలి
మీ చిన్నారులు ప్లేటులోని ఆహారాన్ని తీసుకోవడం కష్టంగా భావిస్తున్నారా..? మొదటి ముద్ద నుంచే వద్దంటున్నారా..? దీని వెనుక కారణం కరోనా అయి ఉండొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

పిల్లలు ఆకలి కోల్పోవడానికి గొంతు పచ్చి (ఫారింజైటిస్) కారణం కావచ్చు. దీంతో ఆహారం, నీరు తక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని చాలా ఆస్పత్రులకు వచ్చే చిన్నారులను పరిశీలిస్తే ఫ్లూ లక్షణాలు ఉంటున్నాయి. స్వల్ప జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు కనిపిస్తున్నాయి

ఈ లక్షణాలు కరోనాకు గురైన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయినా కానీ, పేరెంట్స్ పిల్లలకు కరోనా టెస్ట్ చేయించేందుకు ముందుకు రావడం లేదు. ఫార్మసీ స్టోర్ల నుంచి మందులు తీసుకుని వేస్తున్నట్టు వైద్యుల వాదనగా ఉంది.

పిల్లలు కనుక ఆహారాన్ని తీసుకోకపోతే బలవంతం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి బదులు ఆహారాన్ని స్వల్పంగా ఇవ్వడం, లిక్విడ్ డైట్ ఇవ్వడం మంచిది. ఒక్కసారి కరోనా టెస్ట్ చేయించి, వైద్యుల సలహా తీసుకోవడం ఇంకా మంచిది.
childrens
corona
symptoms
food intake

More Telugu News