వార్నర్ మరోసారి.. పుష్ప శ్రీవల్లిపాటకు ఎంత బాగా డ్యాన్స్ చేశాడో.. ‘నాటునాటు’ కష్టమన్న ఆస్ట్రేలియా క్రికెటర్

23-01-2022 Sun 13:46
  • పుష్ప సాంగ్ ను ఇమిటేట్ చేసిన వార్నర్
  • ఫైర్ మీదున్నావ్ అంటూ అల్లు అర్జున్ కామెంట్
  • చొక్కా మీద పూలున్నా.. డ్యాన్స్ లో ఫైర్ ఉందన్న అమెజాన్ ప్రైమ్
David Warner Steps For Pushpa Srivalli Song Amazed Celebrities
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు పాటలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా పాటలకు అతడు ఇమిటేషన్ చేశాడు. ఇటీవల విడుదలైన బన్నీ పుష్ప సినిమాలోని సన్నివేశాలనూ ఇమిటేట్ చేశాడు. తాజాగా మరోసారి పుష్పలా మారాడు వార్నర్. ‘శ్రీవల్లి’ పాటకు అచ్చం ‘పుష్ప’లా డ్యాన్స్ చేసి మెప్పించాడు.

దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బాగా ఫైర్ మీదున్నావ్ అని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. మరికొందరు సెలబ్రిటీలూ వార్నర్ డ్యాన్స్ పై కామెంట్ చేశారు. ‘నీ చొక్కా మీద పూలున్నా.. నీ డ్యాన్స్ లో మాత్రం ఫైర్ ఉంది’ అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కామెంట్ చేసింది. వార్నర్ భార్య క్యాండీ వార్నర్ కూడా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేసింది.

ఇటు టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ బాగుందంటూ కామెంట్ చేశాడు. ఇక, వారి రిప్లైలకు రిప్లై ఇచ్చిన వార్నర్ ‘ఆర్ఆర్ఆర్’ నాటునాటు పాటపైనా స్పందించాడు. ‘నాటునాటు’ చాలా చాలా కష్టమంటూ వ్యాఖ్యానించాడు.