నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ రిమాండ్ పొడిగింపు

23-01-2022 Sun 06:33
  • నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు
  • రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • ఫిబ్రవరి 4 వరకు జైలులోనే రాఘవ
Vanama Raghavendra Remand extended till feb 4th
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు రిమాండును కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.

రాఘవేంద్ర రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు నిన్న వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న కొత్తగూడెం రెండో అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాఘవ జైలులోనే ఉండనున్నారు.