Karnataka: కేపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. అదేమీ నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Cricket match fixing is not cheating said Karnataka HC
  • 2019 కేపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం
  • సెక్షన్ 420 కింద కేసులు నమోదు
  • ఐపీసీ ప్రకారం ఫిక్సింగ్ నేరం కాదన్న కోర్టు
  • దోషులను శిక్షించడం బోర్డుల పరిధిలోకే వస్తుందన్న కోర్టు
2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో జరిగిన ఫిక్సింగ్ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని స్పష్టం చేసింది. 2019 కేపీఎల్ సందర్భంగా పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక క్రికెట్ సంఘం అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడ్డారంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసును తాజాగా విచారించిన హైకోర్టు.. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతి ప్రకారం ఫిక్సింగ్ శిక్షార్హం కాదని జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి దోషులను శిక్షించడం సంబంధిత క్రీడాబోర్డు పరిధిలోకి వస్తుందని, నిందితులపై సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొంది. చీటింగ్ కేసు వీరికి వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
Karnataka
KPL
Match Fixing
Karnataka High Court

More Telugu News