కరోనా బారిన పడిన ఏపీ మంత్రి మేకపాటి

22-01-2022 Sat 19:10
  • మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్
  • నిన్న కేబినెట్ భేటీకి హాజరైన మేకపాటి
  • తనను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
Mekapati Gautam Reddy tested corona positive
ఏపీలో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. గత కొన్నిరోజులుగా నిత్యం 10 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేకపాటి నిన్న ఏపీ సీఎం నిర్వహించిన కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో మేకపాటి స్పందించారు. తనకు కొవిడ్ సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.