JIO: 1000 నగరాల్లో 5జీ సేవలు... రిలయన్స్ జియో భారీ ప్రణాళిక

Reliance Jio prepares for next generation services
  • త్వరలోనే రిలయన్స్ జియో 5జీ సేవలు
  • పలు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు
  • నెట్ వర్క్ ప్లానింగ్ పూర్తయిందన్న జియో అధ్యక్షుడు
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ సేవలకు సమాయత్తమవుతోంది. భారత్ వ్యాప్తంగా 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు భారీ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఆయా నగరాలకు 5జీ కవరేజి కసరత్తులు పూర్తయ్యాయని జియో ఇన్ఫోకామ్ అధ్యక్షుడు కిరణ్ థామస్ తెలిపారు.

5జీ నెట్ వర్క్ ప్లానింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, రే ట్రేసింగ్ సాంకేతిక పరిజ్ఞానం, త్రీడీ మ్యాప్స్ ద్వారా ట్రయల్స్ చేపడుతున్నామని వివరించారు. ప్రస్తుతం పలు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు థామప్ తెలిపారు. రిలయన్స్ జియో భారత్ లో కొద్దికాలంలోనే అగ్రగామి టెలికాం సంస్థగా ఎదిగింది. గత డిసెంబరు నాటికి జియో యూజర్ల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 
JIO
5G
Reliance
India

More Telugu News