సోదరుడి దశదిన కర్మకాండలకు హాజరైన మహేశ్ బాబు

22-01-2022 Sat 17:11
  • ఈ నెల 8న మరణించిన రమేశ్ బాబు
  • కాలేయవ్యాధితో బాధపడుతూ కన్నుమూత
  • దశదిన కర్మ నిర్వహణ
  • రమేశ్ బాబు నివాసానికి వచ్చిన మహేశ్ బాబు
Mahesh Babu attends brother Ramesh Babu eleventh day rituals
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) ఈ నెల 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, రమేశ్ బాబు దశ దిన కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు హాజరయ్యారు. రమేశ్ బాబు నివాసంలో ఈ కర్మకాండలు నిర్వహించారు. కాగా, సోదరుడు మరణించిన సమయంలో మహేశ్ బాబు కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నారు. దాంతో అన్నయ్యను కడసారి చూసేందుకు వీల్లేకపోయింది.