నియోజకవర్గంలోని వాలంటీర్లకు ఇన్స్యూరెన్స్ చేయించిన వైసీపీ ఎమ్మెల్యే

22-01-2022 Sat 17:01
  • ఇన్స్యూరెన్స్ చేయించిన జక్కంపూడి రాజా
  • జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇన్స్యూరెన్స్ పత్రాల అందజేత
  • జిల్లాలో అభివృద్ధిలో తన నియోజకవర్గం తొలి స్థానంలో నిలిచిందన్న జక్కంపూడి
తన రాజానగరం నియోజకవర్గంలోని గ్రామ సచివాలయం వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్స్యూరెన్స్ చేయించారు. ఇన్స్యూరెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతుల మీదుగా వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ, అభివృద్ధిలో జిల్లాలోనే రాజానగరం నియోజకవర్గం తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. అత్యుత్తమ సంక్షేమ పథకాలను జగన్ ప్రవేశ పెడుతున్నారని అన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను జనాలు పట్టించుకోబోరని... అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.