Harish Shankar: పిండేశావ్ అన్నయ్యా.. అంటూ హరీశ్ శంకర్ పోస్ట్

Harish Shankar Mesmerized By Bhaskara Bhatla Lyrics
  • ట్విట్టర్ లో లిరిక్స్ పెట్టిన భాస్కరభట్ల
  • దానిపై స్పందించిన డైరెక్టర్
  • అబ్బా చింపేశావ్ అంటూ కామెంట్
గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాల దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన దర్శకుడు కాకముందు మాటల రచయితగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీవీ వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘అదుర్స్’ సినిమా పంచ్ డైలాగులతో ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. ఆ పంచ్ డైలాగ్స్ అందించింది హరీశ్ శంకరే. ఆయన అంతలా కవిత్వాన్ని, వచనా కవిత్వాన్ని ఇష్టపడతారు.

తాజాగా పాటల రచయిత భాస్కరభట్ల రాసిన కొన్ని లైన్లు హరీశ్ శంకర్ ను తెగ మెప్పించాయి. ‘‘అలిసిన పక్షులు వాలేందుకైనా ఆసరా అవుతున్నానని ఆనందపడిపోతోంది ఎండిన చెట్టు!!’’ అంటూ భాస్కరభట్ల ఓ లైన్ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానిపై హరీశ్ శంకర్ స్పందించారు. ‘‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. వాస్తవానికి పిండేశావ్’’ అంటూ కామెంట్ చేశారు. దానికి థ్యాంక్స్ అన్నయ్యా అంటూ భాస్కరభట్ల కూడా రిప్లై ఇచ్చారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే పవన్ కల్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. దీనిని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
Harish Shankar
Tollywood
Bhaskara Bhatla

More Telugu News