తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 1,20,243 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు
- రాష్ట్రంలో రెండు మరణాలు
- ఇంకా 29,127 మందికి చికిత్స
అదే సమయంలో 1,920 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,26,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,93,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 29,127 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,069కి పెరిగింది.
