ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై హైదరాబాదులో కేసు నమోదు

21-01-2022 Fri 16:32
  • అనిల్ బంధువు రూప్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు
  • ఒక వ్యక్తిని బెదిరించినట్టు రాజేంద్రనగర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్
  • విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
Hyderabad police filed case against Anil Kumar Yadavs reletive
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో మంత్రి బంధువు రూప్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఒక కాంట్రాక్ట్ విషయంలో ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడినట్టు... టెండర్లను ఉపసంహరించుకోవాలని మురళీకృష్ణారెడ్డి అనే వ్యక్తిని బెదిరించినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెల 3వ తేదీనే రూప్ కుమార్ కు నోటీసులు జారీ చేశామని... అయినప్పటికీ ఆయన స్పందించలేదని పోలీసులు తెలిపారు. విచారణకు హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.