తగ్గేదే లే...మరోసారి విజయసాయి వర్సెస్ రఘురామ!

21-01-2022 Fri 15:33
  • ఒకరిపై ఒకరు విమర్శలు
  • బూచోడు అంటూ విజయసాయి లేటెస్ట్ ట్వీట్
  • అమ్మ సాయీ... అంటూ రఘురామ రిప్లయ్
Vijaysai Reddy Vs Raghurama in Twitter
సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చిన్నప్పుడు అటు వెళ్లకండిరా బూచోడు ఉన్నాడు అని పెద్దవాళ్లు హెచ్చరించేవారని, దాంతో బూచోడు అంటే మతిస్థిమితం లేనివాడని, రాళ్లు విసురుతాడని అనుకునేవాళ్లమని విజయసాయి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజావారిని కూడా అందరూ అలాగే అనుకుంటున్నారని పేర్కొన్నారు. "పరువు తీస్తున్నాడని బంధువులు, కుటుంబ సభ్యులు బయటికి రావడంలేదట... ఏం ఖర్మ!" అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై రఘురామ అదే స్థాయిలో స్పందించారు. "అమ్మ సాయీ... నీ మనసులో నిన్ను తన్నినోడిని ఊహించుకుని మతిస్థిమితం లేదని నన్ను అంటున్నావా?" అని ప్రశ్నించారు. "కొందరి కుటుంబ సభ్యులు (చెల్లెళ్లు) రోడ్లు, కోర్టు మెట్లు ఎక్కారు... ఎందుకంటావ్?" అని నిలదీశారు.