'శేఖర్' నుంచి రెండో సింగిల్ సిద్ధం!

20-01-2022 Thu 17:46
  • డిఫరెంట్ కాన్సెప్టుతో 'శేఖర్'
  • 'జోసెఫ్' కి తెలుగు రీమేక్
  • జోజు జార్జ్ పాత్రలో రాజశేఖర్
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల  
Shekar movie update
రాజశేఖర్ హీరోగా 'శేఖర్' సినిమా రూపొందింది. జీవిత ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ వదలనున్నట్టు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మలయాళంలో జోజు జార్జ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్, విశ్రాంత జీవితం గడుపుతూ ఉంటాడు. కొన్ని కీలకమైన కేసుల్లో డిపార్ట్ మెంట్ ఆయన సహాయ సహకారాలను తీసుకుంటూ ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఆ కేసును ఆయన ఎలా పరిష్కరించాడనేదే కథ. ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవు .. హీరోయిన్ పార్టు ఎక్కువసేపు ఉండదు .. కామెడీ అంతకంటే ఉండదు. మరి తెలుగుకి సంబంధించి కథలో ఏమైనా మార్పులు చేశారేమో చూడాలి. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.