మద్యం మత్తులో దాసరి అరుణ్ కుమార్ వీరంగం.. పలు వాహనాల ధ్వంసం!

20-01-2022 Thu 16:52
  • నిన్న రాత్రి బంజారాహిల్స్ సయ్యద్ నగర్ కు వెళ్లిన అరుణ్
  • మద్యం మత్తులో రోడ్డు పక్కనున్న వాహనాలను ఢీకొన్న వైనం
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Dasari Arun Kumar hits many vehicles in drunken stage
ప్రముఖ సినీ దర్శక, నిర్మాత దివంగత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్ కు ఆయన వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన రోడ్డు పక్కన ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.  

ఈ ఘటనలో పూర్తిగా ధ్వంసమైన ద్విచక్ర వాహనం యజమాని సయ్యద్ అఫ్జల్ దాసరి అరుణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 279, 336, మోటారు వాహనాల చట్టంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఈరోజు ఆయన బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు.