COVAXIN: కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఇక మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు!

  • వ్యాక్సినేషన్‌లో ఈ రెండు టీకాలే వినియోగం
  • బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతులకు వినతి
  • షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సీడీఎస్‌సీవో సిఫార్సు
  • డీసీజీఐ అనుమతి లభించిన వెంటనే మార్కెట్లోకి
covaxin and covishiel soon enter in open market

అవును! ఇకపై కరోనా టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లను మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి ఉంది. ప్రస్తుతం మన దేశంలో చురుగ్గా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వీటినే ఉపయోగిస్తున్నారు.

ఇక ఇప్పుడు వీటిని బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలంటూ ఈ రెండు సంస్థలు విడివిడిగా భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటి అభ్యర్థనను పరిశీలించేందుకు బుధవారం సమావేశమైన సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ కొన్ని షరతులతో ఈ రెండు టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. తుది ఆమోదం కోసం ఈ సిఫార్సులను డీసీజీఐకి పంపిస్తారు. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ రెండు టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.

More Telugu News