తెలంగాణలో మరో 2,983 కరోనా పాజిటివ్ కేసులు

18-01-2022 Tue 19:53
  • తెలంగాణలో కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాదులో 1,206 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 22,472 మందికి చికిత్స
Telangana corona report and statistics
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,472 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,062కి పెరిగింది.