'ఊ అంటావా మావా' పాటకు స్టెప్పులేసిన టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలి పాల్... వీడియో వైరల్

18-01-2022 Tue 19:33
  • అల్లు అర్జున్ హీరోగా పుష్ప
  • ఊ అంటావా పాట సూపర్ హిట్
  • టాంజానియా వరకు పాకిన పుష్ప క్రేజ్
Tanzania social media star Kili Paul performed Oo Antava song
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుప్ప చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇందులోని పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా, సమంత నటించిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా ఈ పాట ఆఫ్రికా దేశం టాంజానియా వరకు పాకిపోయింది.

టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలి పాల్ 'ఊ అంటావా' పాటకు స్టెప్పులేసి, ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఇంకేముందీ... కొద్ది వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయింది. లక్షల్లో లైకులు లభించాయి. కిలి పాల్ కు ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతడి ఖాతాకు 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా, కిలి పాల్ సోదరి నీమా పాల్ కూడా సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.