Umesh Katti: మాస్కు ధరించడం, ధరించకపోవడం వ్యక్తిగత అంశమని ప్రధాని అన్నారు: కర్ణాటక మంత్రి వింత వాదన

Karnataka minister Umesh Katti refused to wear a mask
  • దేశంలో కరోనా తీవ్రం
  • కర్ణాటకలోనూ భారీగా కేసులు
  • మాస్కు ధరించని మంత్రి
  • మంత్రి జవాబుకు అవాక్కయిన మీడియా
కరోనా భూతం స్వైరవిహారం చేస్తున్న తరుణంలోనూ ఓ కర్ణాటక మంత్రి మాస్కు ధరించేందుకు ససేమిరా అంటున్నారు. ఆయన పేరు ఉమేశ్ కట్టీ. కర్ణాటక క్యాబినెట్ లో ఆహార, పౌరసరఫరాలు, అటవీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మాస్కు ఎందుకు ధరించరన్న ప్రశ్నకు ఆయన వింత వాదన వినిపించారు.

"మాస్కు ధరించడం, ధరించకపోవడం అన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని ప్రధాని చెప్పారు. మాస్కు ధరించడంపై ఎలాంటి నిర్బంధం లేదని అన్నారు. అందుకే నేను మాస్కు ధరించాలనుకోవడంలేదు. ఇక సమస్యేముంది?" అంటూ ఉమేశ్ కట్టీ బదులిచ్చారు. ఆయన సమాధానంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.
Umesh Katti
Mask
Corona Virus
Minister
Karnataka

More Telugu News