ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... తాజా మార్గదర్శకాలు ఇవిగో!

18-01-2022 Tue 18:53
 • ఏపీలో కరోనా ఉద్ధృతి
 • భారీగా పెరిగిన రోజువారీ కేసులు
 • ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూ
 • రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
AP Govt issues night curfew guidelines
రాష్ట్రంలోనూ కరోనా రక్కసి కోరలు చాస్తుండడంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుండగా, నేడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో నిన్న 4 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు 7 వేలకు చేరువలో కొత్త కేసులు వెల్లడయ్యాయి.

 • రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ
 • రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
 • వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.
 • చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు మినహాయింపు
 • విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపు
 • షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా.
 • నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి
 • ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి
 • సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.