Kapil Dev: కోహ్లీ ఇకనైనా అహాన్ని వీడాలి: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

  • అప్పుడే అతడికి, జట్టుకు మంచిది
  • కొత్త కెప్టెన్ కు మార్గదర్శనం చేయాలి
  • బ్యాటర్ గా కోహ్లీని వదులుకోలేమని వ్యాఖ్య
  • కెప్టెన్సీని వదులుకోవడాన్ని స్వాగతించిన దిగ్గజం
Kohli Must Shed His Ego Under New Captain Says Kapil Dev

విరాట్ కోహ్లీ తన అహాన్ని తగ్గించుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ఇటీవలే టెస్ట్ కెప్టెన్ గా తప్పుకొంటున్నట్టు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని ఫార్మాట్లలోనూ వేరే కెప్టెన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ స్పందించారు.

కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న కోహ్లీ.. తనలోని అహాన్ని ఇకనైనా వీడాలంటూ పేర్కొన్నారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రస్తుతం కోహ్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని, అతడిపై ఎంతో ఒత్తిడి ఉండి ఉంటుందని అన్నారు. కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న నేపథ్యంలో కోహ్లీ తన మాటలను కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.

‘‘నేను గవాస్కర్ కెప్టెన్సీలో ఆడాను. కె.శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ కింద కూడా ఆడాను. అప్పట్లో నాకు ఎలాంటి ఈగోలూ లేవు. కోహ్లీ కూడా అహాన్ని వీడాలి’’ అని చెప్పారు. దాని వల్ల కోహ్లీతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందన్నారు. కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లకు అతడు మార్గదర్శనం చేయాలని సూచించారు. బ్యాట్స్ మన్ పరంగా చూస్తే కోహ్లీని ఎవరూ వదులుకోలేరని, ఆ చాన్సే లేదని కపిల్ తేల్చి చెప్పారు.

More Telugu News