పంజాబ్ ముఖ్యమంత్రి బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
- ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలపై ఆరా
- సీఎం మేనల్లుడు భూపిందర్ కు ఇసుక కాంట్రాక్టులు
- చిన్న కంపెనీ కాంట్రాక్టులు పొందడంపై సందేహాలు
- రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు
భూపిందర్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు. మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించేందుకు నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎందుకంటే భూపిందర్ పెట్టిన కంపెనీ చాలా చిన్నది. అంత పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్థాయిలో లేకపోవడమే ఈ అనుమానాలకు నేపథ్యంగా ఉంది.
ఇసుక కాంట్రాక్టులు, ఇసుక మాఫియాపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆప్ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది.