NTR: తాతను తలచుకుని భావోద్వేగమైన ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- ఈరోజు ఎన్టీఆర్ 26వ వర్ధంతి
- 1996 జనవరి 18న కన్నుమూసిన ఎన్టీఆర్
- ఎప్పటికీ ధ్రువతార మీరే అంటూ తారక్ ట్వీట్
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలు దిశలా చాటిన నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి నేడు. 1996 జనవరి 18న ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా తన తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 'తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ... ధ్రువతార మీరే' అని తారక్ ట్వీట్ చేశాడు. తన తాత ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నందమూరి సుహాసిని, లక్ష్మీపార్వతి తదితరులు నివాళి అర్పించారు.