Nara Lokesh: కరోనా బారిన చంద్రబాబు.. ట్వీట్ చేసిన టీడీపీ అధినేత

TDP Chief Chandrababu test for corona positive
  • స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న చంద్రబాబు
  • హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ట్వీట్
  • తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కరోనా బారినపడిన తర్వాతి రోజే, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చంద్రబాబు ట్వీట్‌కు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మహమ్మారి బారినుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
Nara Lokesh
Chandrababu
Telugudesam
Corona Virus

More Telugu News