Telangana: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం?

Telangana CM KCR Ready to Campaign in UP Elections
  • బీజేపీపై గుర్రుగా ఉన్న కేసీఆర్
  • మంత్రి మండలి సమావేశంలో యూపీ ఎన్నికల ప్రచారంపై చర్చ
  • పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం
రాష్ట్రంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం. యూపీ ఎన్నికల్లో ప్రచారంపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, రాష్ట్రాల హక్కులను అది కాలరాస్తోందని విమర్శించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కూడా కేసీఆర్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పార్టీ  సమావేశం ఏర్పాటు చేసి ప్రచారం విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
Telangana
KCR
TRS
BJP
Uttar Pradesh

More Telugu News