Mahesh Babu: మహేశ్ కోసం రంగంలోకి బాలీవుడ్ విలన్!

Sunil Shetty in Mahesh Babu Movie
  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • ఆల్రెడీ ముగింపు దశకి చేరుకున్న మూవీ
  • త్వరలో పట్టాలపైకి త్రివిక్రమ్ సినిమా 
  • కథానాయికగా పూజ హెగ్డే
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే మిగతా చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. మోకాలు సర్జరీ నుంచి మహేశ్ కోలుకోగానే తాజా షెడ్యూల్ మొదలుకానుంది.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటించనుంది. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్ రవిచంద్రన్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్ర కోసం సునీల్ శెట్టిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తారట. ఇక మిగతా పాత్రల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది.
Mahesh Babu
Pooja Hegde
Sunil Shetty

More Telugu News