Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా?

Ravindra Jadeja to take up CSK captaincy from Dhoni
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాయకత్వ బాధ్యతలను టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రానున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ వైదొలగబోతున్నాడని చెపుతున్నారు. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ధోనీ పర్యవేక్షణలో జడేజాను కెప్టెన్ గా సిద్ధం చేయాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ ఐపీఎల్ సీజనే ధోనీకి కెప్టెన్ గా చివరి సీజన్ కాబోతోంది. వాస్తవానికి 2021 సీజన్ లోనే ఐపీఎల్ కు ముగింపు పలకాలని ధోనీ భావించాడు. అయితే, ఆ ఐపీఎల్ దుబాయ్ లో జరగడంతో ధోనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సీఎస్కే సొంత మైదానం చెన్నైలో అభిమానుల మధ్య ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలని ధోనీ భావిస్తున్నాడు.
Go Back to Shorts
Ravindra Jadeja
MS Dhoni
CSK
IPL
Captaincy

More Telugu News