తెలంగాణలో కొత్తగా 2,047 మందికి కరోనా పాజిటివ్

16-01-2022 Sun 20:40
  • గత 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 22,048 మందికి చికిత్స
Telangana corona status report
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 2,013 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,048 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.